అభిమాని టీ రుచి అదిరింది:శ్రీకాంత్ రెడ్డి

అభిమాని టీ రుచి అదిరింది:శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం:రాయచోటి: రాయచోటి పట్టణంలో ఓ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన శ్రీకాంత్ రెడ్డికి ఓ అభిమాని తన టీ హోటల్ నందు ఇచ్చిన టీ రుచి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని మైమరపించింది. పట్టణంలోని బోస్ నగర్ వీధికి ఎదురుగా జబీవుల్లా అనే అభిమాని టీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. టీ స్టాల్ సమీపంలోనే ఓ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన శ్రీకాంత్ రెడ్డిని తన టీ స్టాల్ ను సందర్శించాలని అభిమాని కోరగా శ్రీకాంత్ రెడ్డి వెళ్లి టీ సేవించారు. రోజుకు పాలు ఎన్ని ఖర్చు అవుతున్నాయి.. వ్యాపారం బాగుందా అని శ్రీకాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.స్వయంశక్తితో అభివృద్ధి చెందుచున్న జబీవుల్లాను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.