కరోనా బారి నుండి ప్రజలను కాపాడి.. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం.. పార్టీకి ముహూర్తం కూడా ఖరారు..
ఆర్.బి.ఎం డెస్క్: ఏపీలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఆ పార్టీకి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పెట్టబోతున్న నాయకుడు ఎవరో కాదు కొవిడ్ సెంకెడ్ వేవ్‌లో అందరికి సంజీవినిలా కనిపించిన ఆనందయ్య. ఆనందయ్య పార్టీని పెట్టేందకు కసరత్తు చేస్తున్నారు. ఆయన రథయాత్ర కూడా చేసేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారంట. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆయన రథయాత్ర చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని ఆనందయ్య భావిస్తున్నారని చెబుతున్నారు.
కరోనా సమయంలో ఆనందయ్య మందు కోసం తండోపతండాలుగా ప్రజలు అతని వద్దకు వచ్చారు. స్వయంగా ఆనందయ్య మందును తయారు చేశారు. అప్పట్లో ఆనందయ్య మందుకు విపరీతమైన ప్రచారం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఆనందయ్య మందును పంపిణీ చేసింది. కరోనా మందుతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.