బండి సంజయ్‌కు ఎన్నికల కష్టాలు!
ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ నేత బండి పాదయాత్రకు హుజురాబాద్‌లో బ్రేక్ పడింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది. గురువారం బండి సంజయ్ పాదయాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది. హుజురాబాద్ మీదుగా కరీంనగర్ జిల్లాలోకి పాదయాత్ర ఎంట్రీ అవుతుంది. ఎట్లాగో హుజురాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ 2వ తేదిన హుజురాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాషాయ పార్టీ తలపించింది. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన నియమాలు విధించింది. ఎన్నికలు ఉన్న నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని ఈసీ స్పష్టం చేసింది. సభలకు సమావేశాలకు 500లకు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం నిబంధనలతో బీజేపీ నేతలు చిక్కుల్లోపడ్డారు. హుజురాబాద్ తగలకుండా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ జిల్లాలోకి అడుగుపెట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలతో హుజురాబాద్ ముఖం చూడకుండా బండి సంజయ్ తన పాదయాత్ర వెళ్తోంది.