ఆర్ఎంపి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి …

ఆర్ఎంపి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి …

ఆర్.బి.ఎం: ఆర్ఎంపి ,పిఎంపి ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని ఫయాజ్ కళ్యాణ మండపంలో జరిగిన ఆర్ఎంపి , పిఎంపి ల అవగాహన సదస్సులో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం, కడప మేయర్ సురేషబాబు, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషలుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్ఎంపి లు, పిఎంపిలు చేస్తున్న విలువైన సేవలు అభినంద నీయమన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరపున గుర్తింపు లభించేలా కృషి చేస్తామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ హయాంలో గ్రామీణ వైద్యుల సంక్షేమానికి 425జి ఓ ను ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా సమయాలలో రోగులకు ఆర్ఎంపి లు అందించిన సలహాలు, సూచనలు అనేక మంది ప్రాణాలను కాపాడడంతో పాటు వారిలో ధైర్యాన్ని నింపారన్నారు. ప్రతి ఒక్కరు వృత్తిపట్ల చిత్తశుద్ధి, నిబద్ధతతో రోగులకు మేలు జరిగేలా చూడాలన్నారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం మాట్లాడుతూ ఆర్ఎంపి, పిఎంపిల సమస్యలను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తో కలసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్ఠికి తీసుకెళ్తామన్నారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం హితోధికంగా కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఏదైనా అనారోగ్యం బారిన పడితే ప్రాధమిక వైద్యం కోసం మొదటగా సంప్రదించేది ఆర్ ఎం పి లనే ఆన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఫయాజ్ అహమ్మద్,ఆర్ ఎంపి సంఘ జిల్లా ప్రెసిడెంట్ ఆంజనేయులు, సెక్రెటరీ సురేష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, ప్రొద్దుటూరు నౌషాద్ , ఖలీల్ అమీర్ స్థానిక సంఘ నాయకులు రవీంద్ర నాయుడు శ్రీధర్ రెడ్డి, వీరశంకర్, రామ్మోహన్, రెడ్డెప్ప,పి బి రమణ, రఫీ, ధనంజయ రెడ్డి, అనంత రాజు, గణేష్, మల్లన్న, ఆనంద్, అమానుల్లా, ఖాదర్ బాష, చెన్నకృష్ణ, కమాల్ బాష, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.