చంద్రబాబు ఆవేశానికి టీడీపీలో మొదలైన ముఖ్య నాయకుల రాజీనామాలు..

చంద్రబాబు ఆవేశానికి టీడీపీలో మొదలైన ముఖ్య నాయకుల రాజీనామాలు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే పరిషత్ ఎన్నికలు టీడీపీ పార్టీ బహిష్కరిస్తునట్టు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసినవిషయం తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నం అని ప్రకటించిన కొద్దీ గంటల వ్యవధిలోనే ఆ పార్టీ లో ముసలం మొదలైనట్టు తెలుస్తుంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ ముఖ్య నాయకులు రాజీనామాల దిశగా వెళ్తున్నటు తెలుస్తుంది. వారి రాజీనామాలకు ముఖ్య ఉద్దేశం చంద్రబాబు తీసుకున్న నిర్ణయమే అని అంటున్నారు. కాగా బాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సీనియర్ టీడీపీ నాయకులు గుస్సా అవుతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రు రాజీనామా చేసినట్టు ప్రకటించారు . చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం నిరాశకు గురి చేసిందని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ నాయకులు అశోక గజపతిరాజు చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానిక కేడర్ అభిప్రాయాన్ని ముందుగా తీసుకుంటే బాగుండేది అని అన్నారు.

ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని అయన మరోసారి గుర్తు చేశారు. టీడీపీ పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవమేనని అన్నారు. అదేవిధంగా గెలిచినా ఓడిన పార్టీ సిద్ధాంతాలకోసం పనిచేయాలని అశోక గజపతిరాజు బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published.