ఆ వ్యాధి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

ఆ వ్యాధి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

ఆర్.బి.ఎం డెస్క్: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం విదితమే కాగా బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని అయన అన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడం కోసమే ఈ ఫీవర్ సర్వే అని అయన అన్నారు. పాజిటివ్ వచ్చి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఆస్పత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందిస్తాం అన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.