పేదల కోసం సిటీ స్కాన్ ధరలు తగ్గింపు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పేదలను దృష్టిలో ఉంచుకొని వారి కోసం మహబూబ్ నగర్ లోని అన్ని స్కానింగ్ సెంటర్లలో సిటీ స్కాన్ ధరలను తగ్గించామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరోనా సోకినా వ్యక్తులు తప్పనిసరిగా సిటీ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుందని నగరంలో సిటీ స్కాన్ చేయించుకోవాలంటే సుమారుగా 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని పేద ప్రజలు అంత డబ్బు ఖర్చు చేయడం వారికీ ఇబ్బందిగా ఉంటుందని వారి కోసం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లలో సిటీ స్కాన్ కేవలం 1999 రూపాయలు ఉండేటట్టు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడి ధరలను తగ్గించమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.