చంద్రబాబుపై రాళ్ల దాడి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:  తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడిపై పలువురు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందు ప్రచార రథంలోకి ఎక్కినా చంద్రబాబు నాయుడు. అందరూ చూస్తుండగానే వాహనం పైకి రాళ్లతో దాడి చేసి అక్కడి నుండి ఆ వ్యక్తులు పరారైయ్యారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా రాళ్లతో దాడికి పాల్పడంతో చంద్రబాబు వెనుక ఉన్న ఇద్దరు టీడీపీ నాయకులకు స్వల్ప గాయాలైయ్యాయి. వారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించిన టీడీపీ కార్యకర్తలు.

అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ దారుణ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రచార వాహనం ముందు బైఠాయించి చంద్రబాబు నాయుడు అయన ఆవేదన వ్యక్తం చేశారు.

జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న నాకే రక్షణ లేకుండా పోయింది ఇంకా మాములు ప్రజలకు రక్షణ ఎలా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగా తమపై తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతుంటే పోలీసు వ్యవస్థ ఎం చేస్తుంది అని చంద్రబాబు ప్రశ్నించారు.

తమకు తమ పార్టీ ముఖ్య నేతలకు రోజు రోజుకు భద్రత కరువైపోతుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని అయన కోరారు. కాగా ఇప్పటికే తిరుపతిలో ఉప ఎన్నికల్లో భాగంగా పార్టీలు విస్తృతంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. చంద్రబాబు పై ఎవరు దాడి చేశారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి దాడులకు నేను భయపడే వ్యక్తిని కాదని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.