వకీల్ సాబ్ జాతి రత్నాలు కలెక్షన్స్‌ను టచ్ చేయలేకపోయింది..

వకీల్ సాబ్ జాతి రత్నాలు కలెక్షన్స్‌ను టచ్ చేయలేకపోయింది..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా తీవ్రత అధికంగా ఉన్న పలు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ ను బద్దలుకొడుతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిందీ మూవీ పింక్ కు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ మూవీ ఈ నెల 9న విడుదలైంది. కాగా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్‌ను తెచ్చిపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టడం అంత సులువైన విషయం కాదనే చెప్పొచ్చు.

వకీల్ సాబ్ మూవీ కంటే ముందు రిలీజ్ అయిన జాతి రత్నాలు మూవీ వకీల్ సాబ్ కంటే అధికంగా కలెక్షన్స్ చేశాయని ఈమేరకు తెలుస్తోంది.మొదటి ఆదివారం రోజున జాతి రత్నాలు మూవీ 121 లొకేషన్స్‌లో 1.26 లక్షల డాలర్లు వసూలు చేసుకుంది .. పవన్ కళ్యాన్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ 283 లొకెషన్స్‌లో 66 వేల డాలర్స్ కె ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ కేవలం అమెరికాలోనే కాకుండా న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియాలో కూడా జాతి రత్నాలు మూవీ మంచి కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఫస్ట్ వారం పూర్తి అయ్యేసరికి జాతిరత్నాలు మూవీ ప్రీమియర్స్‌తో కలుపుకుని 7 లక్షల డాలర్లు వాసులు చేసింది. కాగా వకీల్ సాబ్ మూవీ మాత్రం 6.50 లక్షల డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.