వైద్యరంగానికి పెద్దపీట…

వైద్యరంగానికి పెద్దపీట…

ఆర్.బి.ఎం: వైద్యరంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం రాయచోటి పట్టణంలోని డైట్ ప్రాంగణంలో ఆరోగ్యానికి భరోసా-ప్రగతికి హామీ నినాదంతో ఆయుష్మాన్ భారత్ ఆజాదికా అమృత్ మహోత్సవ్ బ్లాక్ లెవల్ ఆరోగ్యమేళాలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఫయాజ్ బాష, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, ఎంపిపి పల్లపు రాజమ్మ లతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత స్టాల్స్ ఆరోగ్యశ్రీ, రిజిస్ట్రేషన్,కంటి వైద్యం విభాగం,సంక్రమిత మరియు అసంక్రమిత వ్యాధుల విభాగం, సాధారణ వైద్యం మరియు శ్వాస కోశ వ్యాధుల విభాగం, చర్మ వ్యాధుల విభాగం, చెవి, ముక్క, గొంతు విభాగం, చిన్నపిల్లల వ్యాధులు, స్త్రీ ప్రసూతి సంబంధిత వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్,వ్యాధినిరోధక టీకాలు, మలేరియా క్లినిక్, క్షయ, కుష్టు, హెచ్ ఐ వి వ్యాధుల విభాగం, ఆరోగ్య సమాచారం మరియు అవగాహన కేంద్రం, ఉచిత ల్యాబ్ పరీక్షలు, ఐ సి డి ఎస్ , మందుల పంపిణీ కేంద్రం, రక్త దానం శిబిరాలను వైద్యాధికారులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి, జకీయా ఖానం లు ప్రారంభించారు.

నేను సైతం అన్నమయ్య జిల్లా రాయచోటి పొగాకు రహిత జిల్లాగా మారుద్దాం అన్న సంతకం ప్రచారంలో శ్రీకాంత్ రెడ్డి, జకీయా ఖానం లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని,ఆ పథకాన్ని సీఎం జగన్ మరింత పటిష్టపరచడం జరుగుతోందన్నారు. ఈ పథకంతో కొన్ని లక్షల ప్రాణాలకు పునర్జన్మ కలుగుతోందన్నారు.ఆరోగ్యశ్రీ క్రింద 2446 జబ్బులుకు చికిత్సలు, శస్త్ర చికిత్సలుఅందుతున్నాయన్నారు. 1519 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు కు రోగి చికిత్సానంతరం జీవనభృతికోసం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ 225 చొప్పున నెలకు గరిష్టంగా రూ 5 వేలు చొప్పున అందించడం పేద రోగులకు ఒక వరమన్నారు.

ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం అందించే ఆసుపత్రులకు గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులను సక్రమంగా చెల్లిస్తున్నారన్నారు.ఆరోగ్యపథకాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన వైద్యాధికారులును కోరారు.పట్టణంలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలుతో పాటు నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుచున్నాయన్నారు.వైద్య రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులును జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వైద్య శాఖలో పెద్ద ఎత్తున ఏ ఎన్ ఎం , వైద్యుల పోస్టులును భర్తీ చేయడం చారిత్రకమన్నారు.శిబిరంలో రక్తదానం చేసిన రక్త దాతలను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులును శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డా బాలాంజనేయులు,ఆరోగ్యమిత్రలు అందచేశారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య పథకాలు, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.శిబిరంలో పాల్గొన్న వారికి రోటరీ క్లబ్ వారు మజ్జిగ, మానవతా సంస్థ వారు త్రాగునీటిని సరఫరా చేశారు.

Leave a Reply

Your email address will not be published.