అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్,కౌన్సిల్ చైర్మన్,ప్రభుత్వచీఫ్ విప్ , ప్రిన్సిపాల్ సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష….

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్,కౌన్సిల్ చైర్మన్,ప్రభుత్వచీఫ్ విప్ , ప్రిన్సిపాల్ సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష….

ఆర్.బి. ఎం:  అసెంబ్లీ సమావేశాలపై గౌరవఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం,గౌరవ కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు,గౌరవ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ, కౌన్సిల్ సెక్రటరీల ఆధ్వర్యంలో అన్ని శాఖల ప్రిన్సిపాల్ సెక్రటరీలు, పోలీసు  ఉన్నతాధికారులుతో అసెంబ్లీ ఏర్పాట్లు మరియు అంశాలపై సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షా సనావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 45 శాఖల నుండి వచ్చిన చెందిన స్పెషల్ సెక్రటరీలు , ప్రిన్సిపల్ సెక్రటరీలు, కనీషనర్ లు తో దాదాపు 45 మంది ఐఏఎస్ అధికారులుతో అసెంబ్లీకి సంబంధించిన అన్ని అంశాలుపైన సిద్ధంగా ఉండాలని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు, షార్ట్ డిస్కషన్స్ లకు మరియు జీరో అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఏ మాత్రం అలసత్వం లేకుండా వెంటనే సమాధానాలు పంపాలని ఆదేశించారు.

అన్ని శాఖలకు సంబంధించిన 420 దాకా నిలిచిపోయిన ప్రశ్నలు పెండింగ్ లో ఉన్నాయని,వాటికి సమాధానాలును వారంలోగా ఎట్టి పరిస్థితుల్లో హౌస్ కు, సభ్యులకు చేర్చాలని వారు సూచించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నూతనంగా డిజి పి గా బాద్యతలు చేపట్టిన రాజేంద్ర నాధ రెడ్డి ని గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం, గౌరవ కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు,గౌరవ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు అభినందించి సత్కరించారు. చుట్టుపక్కల జిల్లాల ఎస్ పి లు, డి ఐ జి లుతో అసెంబ్లీకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు , అసెంబ్లీకి వచ్చే ప్రతి సభ్యుడి గౌరవం నిలిపేలా వ్యవహరించాలని , అదేరకంగా అన్ని పార్టీలకు చెందిన ఎం ఎల్ ఏ లు నివసించే ప్రాంతాలలో భద్రతా చర్యలు చేపట్టాలని గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లుతో సిద్ధంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, ఆడిషనల్ చీఫ్ సెక్రటరీలు రాజశేఖర్, పూనం మాల కొండయ్య,కృష్ణబాబు, కాంతి లాల్ దండే తదితర అధికారులు వారితో పాటు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.