ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు ఈసీ కసరత్తు

ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు ఈసీ కసరత్తు

ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 29తో ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది. మహబూబ్‌నగర్, ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలోని ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదుకు ఈసీ అవకాశమిచ్చింది. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 23న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించాలని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ప్రకాశం జిల్లా ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గా ఎన్నికలు ఉన్నందున అక్టోబర్ 1 నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టాని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి ఓటర్ల నమోదు ప్రారంభం కానుంది. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్లు తమ పేర్లు కొత్తగా నమోదుచేసుకోవాలి. వచ్చే నవంబరు ఒకటికి మూడేళ్ల ముందు అంటే…2019 అక్టోబరు 31వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published.