ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పబ్‌జీ ఆడడం వాళ్ళ వచ్చే నష్టాలు ఇప్పటికే మనం ఎన్నో వార్తల్లో చూశాం. పబ్‌జీ కి బానిసై మన తెలుగు రాష్ట్రాలలో కూడా మృత్యువాతపడ్డారు అది తెలిసిన విషయమే. ఒక్క చనిపోవటంతోనే ఈ సమస్య ఆగలేదు ఎంతో మంది మతిస్థిమితం లేకుండా కూడా అయ్యారు. ఈ పబ్‌జీ గేమ్ విద్యార్థుల చదువును కూడా కొల్లగొటింది. బెట్టింగుల తో కూడిన గేమ్ ఆడి లక్షల్లో నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా కొద్దీ రోజుల క్రితం పబ్‌జీ గేమ్ బ్యాన్ చేయగా దానికి బానిసైన వారు కొందరు ఇప్పటికి ఎదో రకంగా ఆ ప్రాణాంతక గేమ్ ఆడుతూనే ఉన్నారు. అయితే తాజాగా పబ్‌జీ కారణంగా పాకిస్థాన్ లోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పబ్‌జీ ఆటకు బానిసైన వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఎదో చిన్న మాట ఆనందుకు వారి పై పబ్‌జీ తరహాలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోగా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
పాకిస్థాన్ కి సంబంధించిన ఒక న్యూస్ ఛానెల్ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్లోని నావా కోట్ సమీపంలో జరిగిన ఓ సంఘటన స్థానికులని తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. పబ్‌జీ గేమ్ లో ఎలాంటి డ్రెస్సు వెస్కొని ప్రత్యర్థుల్ని చంపుతారు అదేవిధంగా ఆ వ్యక్తి కూడా అలంటి దుస్తులు ధరించి గన్ తో కాల్పులు జరిపాడు. గన్ శబ్దం రావడంతో ఒక్కసారిగా స్థానికు ఉల్లిక్కిపడ్డారు. ఏమైందో అని చూసేసరికి కుటుంబం మొత్తం రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడారు. ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోగా మిగితా ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పాక్ పోలీసులు.