భూ వివాదంలో పోలీసుల అదుపులో సాక్షి, Ntv, Tv9 రిపోర్టర్లు..

భూ వివాదంలో పోలీసుల అదుపులో సాక్షి, Ntv, Tv9 రిపోర్టర్లు..

ఆర్.బి.ఎం అనంతపురం: ఓ వ్యక్తి భూమిని ఆస్తికి మరో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి రూ.కోట్ల విలువైన 14.96 ఎకరాల భూమిని మరొకరికి విక్రయించి, రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని రాచానపల్లి సమీపంలో 14.96 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అనుమానంతో బాధితులు విచారించగా వారి ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు విలేకర్లు కుట్ర చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో 14.96 ఎకరాలు విక్రయించారు. అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కురుర్చుకున్నారు. ఇప్పటికే రూ.75 లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ‘స్పందన’లో పోలీసులకు భూ యజమాని వెంకటసుబ్బయ్య ఫిర్యాదు చేశారు. విచారణలో వెలుగులోకి విలేకరులు హనుమంతు, వేణుగోపాల్, రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రముఖ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ పాత్ర కూడ ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ముందు శ్రీనివాసులు అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. శ్రీనివాసులను విచారించగా అచ్చుకట్ల ఇంతియాజ్, బత్తల శేఖర్, సురేష్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గరిని విచారించడంతో సాక్షి, Ntv, Tv9 మీడియా విలేకరుల పేర్లు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.