తాడిపత్రి: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి డీఎస్పీ చైతన్య (DSP మధ్య మాటల యుద్ధం ముదిరి పాకానపడింది. డీఎస్పీ పోలీస్ స్టేషన్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ప్రభాకరరెడ్డి ఆరోపించారు. రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని విమర్శించారు. అయితే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను డీఎస్పీ చైతన్య ఖండించారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్షకు పూనుకున్నారు. కౌన్సిలర్‌లతో కలిసి బ్లాక్ డ్రెస్‌తో దీక్షకు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్నద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో అనుమతి లేకుండా రోడ్డుపై బైంటాయించారంటూ ప్రభాకర్‌రెడ్డితో పాటు 120 మంది కేసు నమోదు చేశారు.
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. ఆందోళనలో ప్రజలు
