రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను అందరూ గౌరవించాలి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను అందరూ గౌరవించాలి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం: భారత రాజ్యాగంలో ఆర్టికల్ 25 లో ఉన్న అంశం అన్ని మతాలను, కులాల వారు గౌరవించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. Article 25 of the Constitution guarantees freedom of religion to all persons in India. It provides that all persons in India, subject to public order, morality, health, and other provisions: Are equally entitled to freedom of conscience, and. Have the right to freely profess, practice and propagate religion రాజ్యాంగంలో ఉన్న అంశాలును ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డిగుర్తుచేశారు.

హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ మతస్తులు ఇలా ఎవరి మతపరమైన విశ్వాసాలను , సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి, మనుష్యుల మధ్య చిచ్చుపెట్ట కూడదన్నారు. ఏ ఒక్కరి మనోభావాలను అగౌరవ పరచకుండా, అందరి మనోభావాల కనుగుణంగా నేటి బాల బాలికలను, పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కర్ణాటకలో ఈ అంశాలపైన న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయని, న్యాయస్థానాలలో తీర్పు త్వరగా రావాలని ఆయన ఆకాంక్షించారు.

సున్నితమైన అంశాలను వ్యక్తిగత కోణంలో చూడకుండా, ఏమతం వారి మనోభావాలను అగౌరవ పరచకుండా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి వుండాలని ఆయన కోరారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా గౌరవంగా ఉండాలన్నదే భారతీయుడిగా మన లక్ష్యమని అభిప్రాయపడ్డారు .దేశాన్ని అస్థిర పరచాలనుకుంటున్న కుట్రదారులకు అవకాశం ఇవ్వకూడదన్నారు.మారుతున్న కాలానుగుణంగా హుందాతనాన్ని పెంచుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.