పసల కృష్ణభారతికి పాదభివందనం చేసిన ప్రధాని

పసల కృష్ణభారతికి పాదభివందనం చేసిన ప్రధాని

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సమరయోధుల కుటుంబాలను స్మరిస్తూ సభకు తీసుకొచ్చిన ప్రసిద్ధ సమరయోధులు తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతుల కుమార్తె కృష్ణభారతి (90) కాళ్లకు నమస్కారించారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మి తంజావూరు జైలులో కృష్ణ భారతికి జన్మనిచ్చారు. ఆమె కుటుంబ చరిత్రను వేదికపై వివరించారు. దీంతో ప్రధాని మోదీ ఆమె కాళ్లకు నమస్కరించారు.

Leave a Reply

Your email address will not be published.