నీళ్లు తాగడానికి బద్దకించారంటే.. మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

మనలో చాలా మంది నీళ్లు తాగటానికి బద్దకిస్తూ ఉంటారు. రోజు కనీసం ఐదారు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నా చాలా మంది పట్టించుకోరు. తక్కువ నీటిని తీసుకుంటే  అనారోగ్యాన్ని   తెచ్చుకున్నట్లే అని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. దాహం వేయకపోయినా, తరచూ నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తూ ఉంటే ఎన్నో ఆరోగ్య ఫలితాలు పొందుతారు. తరచూ కొందరు తలనొప్పికి గురవుతూ ఉంటారు. ఈ లక్షణం మీ శరీరంలో నీటి శాతం తగ్గిందనడానికి తెలియజేస్తుంది. ఆ సమయంలో మీరు ఓ గ్లాసు నీటిని తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మందిలో కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నీళ్లు తాగుతూ ఉంటూ మీ కళ్లు తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటాయి. నీళ్లు సరిపడ తాగితే ఇలాంటి సమస్యలకు  చెక్ పెట్టవచ్చు. యుక్త వయసు వచ్చిన వారు మొటిమలతో బాధపడుతూ ఉంటారు.

తరచూ మొటిమలు వేధిస్తుంటే రక్తశుద్ధి తగ్గిందని అర్థం. రోజుకు 8 నుంచి 10 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగితే, రక్తంలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గి మొటిమలు మటుమాయమవుతాయి. అలాగే గోళ్లు, వెంట్రుకలు దృఢంగా ఉండాలంటే, సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో కొవ్వు కరగడానికి నీళ్లు తోడ్పడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు తాగే నీటి పరిమాణాన్ని పెంచుకుంటే మంచిది. చర్మం జీవంతో తొణికిసలాడాలంటే తరచూ నీళ్లు తాగాలి… నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం మెరుపు సంతరించు కుంటుంది. మీలో ఎండకు చర్మం తేలికగా కమిలిపోతుందంటే, మీ శరీరంలో నీరు శాతం తగ్గిందని అర్థం. ఎండలోకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత తప్పనిసరిగా నీళ్లు తాగితే మంచి ఫలితాలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published.