క్యాసారంలో సదర్‌ సందడి…

క్యాసారంలో సదర్‌ సందడి…

ఆర్.బి.ఎం: క్యాసారంలో సదర్‌ వేడుక అంబరాన్నంటింది. దున్నపోతుల ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపావళి పటాకుల మోత ఒకెత్తయితే ఆ తర్వాత జరిగే సదర్ సందడిలో కనిపించే దున్న పోతులు మరొక ఎత్తు. దీపావళి పండుగ తర్వాత నిర్వహించే సదర్‌ సంబరాలు మల్లికార్జున కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో క్యాసారం గ్రామంలో ఘనంగా జరిగాయి. ప్రతియేటా గ్రామంలోని యాదవులు సదర్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా దున్నపోతులను ప్రదర్శనకు పెట్టారు యాదవులు. వాటిని సుందరంగా అలంకరించి ఊరేగించారు. యాదవులతో పాటు గ్రామంలోని యువత వీటి వెంట ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో ఎంజాయ్ చేశారు.

రాజేష్ గౌడ్, పటాన్‌చెరు క్రైమ్ రిపోర్టర్

Leave a Reply

Your email address will not be published.