కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి దుమారం..

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి దుమారం..

హైదరాబాద్: టీపీసీసీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి దుమారం రేపుతోంది. ఆయన టీపీసీసీ నిర్ణయాన్ని దిక్కరించి వైఎస్‌ఆర్ ఆత్మీయ సమ్మేళానికి వెళ్లారు. అంతకుముందే వైఎస్‌ఆర్ ఆత్మీయ సమ్మేళానికి ఎవరూ వెళ్లొందని టీపీసీసీ అల్టిమేటం జారీ చేసింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ సమ్మేళానికి వెళ్లలేదు. అయితే పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆత్మీయ సమ్మేళానికి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి గెలిచి వేరే పార్టీ నేత వద్దకు వెళ్లి కాళ్లు మొక్కారు అంటూ ఎమ్మెల్యే సీతక్కను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ నేత మధుయాష్కి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని, పార్టీకి వెన్నుపోటు పొడవద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఆదేశాలను బేఖాతరు చేశారని కోమటిరెడ్డిపై ఢిల్లీకి ఫిర్యాదు చేశారు.

అయితే ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి చక్కబెట్టాలని ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెళ్లడం తప్పుకాదని సమర్ధిస్తూనే.. కొత్త పీసీసీకి, కోమటిరెడ్డికి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ త్వరలో పోతుందని చెప్పారు. ఆ గ్యాప్ తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ. అటు రేవంత్, ఇటు కోమటిరెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీతక్క రాఖీ కట్టడం కూడా తప్పు కాదన్నారు. పీసీసీ మీద ఎవరు కామెంట్ చేసినా సమర్దించని, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ఏ ఆదేశం ఇచ్చినా ఫాలో అవుతామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి తన పూర్తి మద్దుతు ఉంటుందని జగ్గారెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published.