ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్
ప్రకాష్‌రాజ్ టీమ్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్
హైదరాబాద్: ‘మా’ ఎన్నికల రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ‘మా’ ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలు’ ప్యానల్ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నటుడు ప్రకాష్ రాజ్‌కు నిర్మాత బండ్ల గణేష్ షాకిచ్చారు.
ప్రకాష్‌రాజ్ టీమ్ నుంచి గణేష్ బయటకు వచ్చారు. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కు అధికార ప్రతినిధిగా గణేష్ ఉన్నారు. ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా బండ్ల గణేష్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. ‘‘నా మనస్సాక్షి చెప్పినట్లు చేస్తా. ఒక్క అవకాశం ఇవ్వండి.. నేనేంటో చూపిస్తా. పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడం నాధ్యేయం. దాని కోసం పోరాడతా.. వారి సొంతింటి కల నిజం చేస్తా.
ఇప్పుడు పదవుల్లో ఉన్నవారు రెండేళ్లుగా ఏం చేయలేదు. గొడవలతో ఇంతకాలం ‘మా’ సభ్యులను మోసం చేసింది చాలు. ఇకనైనా పేద కళాకారుల కలలను నిజం చేద్దాం’’ అని బండ్ల గణేష్ ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్‌లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కనీసం ఈసీ మెంబర్స్ లిస్ట్‌లో కూడా బండ్ల గణేష్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఇదే…
అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
వైస్ ప్రెసిడెంట్స్: హేమ, బెనర్జీ
జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
జాయింట్ సెక్రటరీస్: ఉత్తేజ్, అనితా చౌదరి
ట్రెజరర్: నాగినీడు
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్
అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూం, కౌషిక్, ప్రగతి, రమణారెడ్డి, శ్రీధర్ రావు, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు డి., సురేష్ కొండేటి, తనిష్, టార్జాన్