వయసు తక్కువ షోలు ఎక్కువ..: గాలోడు ట్రైలర్

సుడిగాలి సుధీర్ నటిస్తున్న ‘గాలోడు’ట్రైలర్‎ను శుక్రవారం విడుదల చేశారు. ‘వయసు తక్కువ షోలు ఎక్కువ అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. నువ్ శనివారం పుట్టావా శని తుగులుకుంటేను అనే డైలాగ్  ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..సరికొత్తగా సుధీర్ కేరీర్ కు టర్న్ పాయింట్ దొరికినట్టు అనిపిస్తోంది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సుధీర్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ ను బట్టి.. మాస్ అవతార్ లో దుమ్ములేపుతున్నారు. డాన్స్, డైలాగ్స్ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొట్టారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, లోకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా చిత్రంపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ కనిపిస్తోంది.

ఇక..సుడిగాలి సుధీర్ ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు సుధీర్. బుల్లితెరతో పాటు మరోవైపు వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ నటించిన తాజా చిత్రం గాలోడు. ఈ సినిమా ట్రైలర్‎ని శుక్రవారం విడుదల చేశారు. ‘గాలోడు’సినిమాని నవంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published.