ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో దొరికే ఏకైన పండ్లు అరటి పండ్లు. అరటిపండ్లను ఎడాది పిల్లాడి నుంచి వందేళ్ల వృద్ధుడి వరకు అందరూ తినోచ్చు. ఇది తక్కువ ధరకు దొరుకుతుంది కాదా.. అని చిన్నచూపుచూడాల్సిన అవసరం లేదు. ఈ పండులో అనేక పోషకాలున్నాయి. తిన్న క్షణాల్లోనే శరీరానికి అరటిపండు శక్తిని ఇస్తుంది. అందరూ ఇష్టంగా తినే అరటిపండ్లపై కొన్ని రోజులుగా అసత్య ప్రచారం ఒకటి వైరల్ అవుతోంది. ఆ వార్త ముఖ్య విశేషం ఏమిటంటే.. అరటిపండు తిన్న 12 గంటల్లో మరణిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే మనదేశంలో పండిస్తున్న అరటిపండు తింటే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ సోమాలియా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో అరటిపండ్లు దిగుమతి అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ అరటిపండ్లు తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి మొదలయి ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఈ అరటిపండ్లలో భయంకరమైన బ్యాక్టీరియాలున్నాయని, ఆ బ్యాక్టీరియా వానపామును పోలి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాడులోని నేషనల్ బనానా రిసర్చ్ సెంటర్ టెలికో బ్యాక్టర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాడైన అరటిపండ్లలో టెలికో బ్యాక్టర్ గురించిన ఆనవాళ్లు కనిపించడం లేదని చెబుతున్నారు. అయితే ఇటీవల వైరల్ అవుతున్న వీడియోల్లో చూపించినట్లుగా బ్యాక్టీరియా పరిమాణం వానపాములా అంత పెద్దగా ఉండదని తెలిపింది. బ్యాక్టీరియాలను మైక్రోస్కాప్‌లో మాత్రమే చూడగలమని వివరించింది. వాస్తవానికి సోమాలియా నుంచి భారత్ అరటిపండ్లను దిగుమతి చేసుకోలేదని, ఇలాంటి పుకార్లను నమ్మోదని అధికారులు చెబుతున్నారు.
అరటిపండు తింటే 12 గంటల్లో మరణం.. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు..!
