షర్మిలకు షాక్.. పరామర్శించడానికి తమ ఇంటికి రావోదంటూ..

షర్మిలకు షాక్.. పరామర్శించడానికి తమ ఇంటికి రావోదంటూ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేస్తుంది. కాగా ఈమంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయాల్సి ఉంది కానీ దీక్షకు ముందు రోజే షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణాలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదనే మనస్తాపంతో నరేష్ అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నరేష్ తండ్రి వైఎస్ షర్మిలను పరామర్శించడానికి దీక్ష చేయడానికి తమ ఇంటికి రావాడంటూ విజ్ఞప్తి చేశాడు. దింతో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ లో నాయకులు పూనాలోచనలో పడ్డారని తెలుస్తోంది.లింగాపురానికి చెందిన నరేష్ డిగ్రీ పూర్తి చేశాడు. నరేష్ ముగ్గురు సోదరులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నరేష్ డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాలు ఏమి రాకపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు.

Leave a Reply

Your email address will not be published.