సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభం..!
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల ఓపెనింగ్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభించుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రత్యక్ష క్లాసులు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర విద్యాశాఖ ప్రస్తుత తాజా పరిస్థితులపై నివేదిక అందించింది.