కాంగ్రెస్ వైపు తెరాస మాజీ ఎమ్మెల్యే..!

కాంగ్రెస్ వైపు తెరాస మాజీ ఎమ్మెల్యే..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నకిరేకల్ మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం తెరాస పార్టీని వీడుతారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వేముల వీరేశం 2014 లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి నకిరేకల్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో తెరాస పార్టీ బలోపేతానికి వేముల వీరేశం అలుపెరగని కృషి చేశారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైయ్యారు.ఆ ఓటమి వేముల వీరేశం రాజకీయ భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టింది.

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య తెరాస పార్టీలో చేరడంతో అప్పటివరకు నియోజకవర్గంలో తెరాస పార్టీకి అన్ని తానే వ్యవహరించిన వేముల వీరేశంకు క్రమంగా పార్టీలో ప్రాధ్యాన్యత తగ్గడం మొదలైంది. ప్రస్తుతం నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య చక్రం తిప్పుతున్నారు. ఇటీవల వేముల వీరేశం కు ఉన్న ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం తొలగించింది.దింతో వేముల వీరేశం తెరాస పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

నకిరేకల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నటు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ తనకు కేటాయిస్తే పార్టీలో చేరడానికి మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. వేముల వీరేశం నూతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి సిద్దంగానే ఉన్నారనే సమాచారం.

Leave a Reply

Your email address will not be published.