షర్మిలకు ఊహించని షాక్… మరో కీలక నేత రాజీనామా

షర్మిలకు ఊహించని షాక్… మరో కీలక నేత రాజీనామా

ఆర్.బి.ఎం హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీకి ఆదిలోనే ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు నేతలు రాజీనామా బాట పట్టారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కన్వీనర్ పదవికి ఇబ్రహీం రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. ఇటీవల వైఎస్‌ఆర్‌టీపీకి ఇందిర శోభన్ రాజీనామా చేసి కలకలం సృష్టించారు. షర్మిల పార్టీ స్థాపించేందుకు సన్నహాకాలు ప్రారంభించముందు ఇందిరా శోభన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన షర్మిలకు అండగా నిలిచారు. వైఎస్‌ఆర్‌టీపీ స్థాపించిన తర్వాత ఇందిరా శోభన్‌కు ఆ పార్టీలో సముచిత స్థానం కూడా కల్పించారు. అయినప్పటికే ఆమె వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. గతంలో వైఎస్‌ఆర్‌టీపీకి చేవెళ్ల పార్లమెంటరీ కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. అంతేకాదు షర్మిలకు అండగా ఉన్న రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెప్పిన షర్మిలకు ఆ పార్టీ నేతలు ఊహించని షాక్‌లు తగిలిస్తున్నారు. వరుసగా నేతల రాజీనామాలతో ఆ పార్టీలో అంతర్మనంలో పడినట్లు చెబుతున్నారు. నేతల రాజీనామా వెనుక ఆ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందని, అందువల్లే నేతులు రాజనామా బాట పడుతున్నారని పలువురు చెబుుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.