రైతుల రంధితీర్చిన రైతుబంధు పథకం: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం వికారాబాద్: ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు బూర్గుపల్లిలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా వేదిక పై కూర్చోబెట్టి రైతులను సన్మానించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యత లేక నాడు దండగన్న వ్యవసాయాన్ని నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు.
పంటకు పెట్టుబడి సాయంగా 63 లక్షల కుటుంబాలకు రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు దఫాల వారీగా యాభై వేల కోట్లు రైతులకు అందించిన ఘనత కెసిఆర్ ది అన్నారు. రైతుభీమా, ఉచితకరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం అధిక మోతాదులో వ్యవసాయ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.