తెలంగాణలో వర్ధిల్లుతున్న గ్రామ స్వరాజ్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

తెలంగాణలో వర్ధిల్లుతున్న గ్రామ స్వరాజ్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ పల్లె ప్రకృతి వనాలన్నారు. గ్రామంలోని బావులపై పూర్తి స్థాయిలో పై కప్పులు ఏర్పాటు చేయాలని పంచాయతి కార్యదర్శిని ఆదేశించారు.

ఒకటో వార్డులో మిషన్ భగీరథ నీటి సమస్య ఎక్కువగా ఉందని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వీధి దీపాల ఆన్/ఆఫ్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ మరియు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ వెంటనే ఇవ్వాలన్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. గ్రామంలోని శానిటేషన్ పనులు చక్కగా చేపడుతున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.