రైతు సంక్షేమంలో దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్టం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

రైతు సంక్షేమంలో దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్టం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మరియు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు ఉచితంగా 24గంటల కరెంటు, సాగు నీరు, సబ్సిడీ, రైతు బంధు, రైతు భీమా లాంటి ఎన్నో కనివిని ఎరుగని రీతిలో రైతులకు సంక్షేమాన్ని అందిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి, దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేవిదంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే రైతుల అకౌంట్ లో డబ్బులు జమచేయడానికి ఆధార్ బ్యాంక్ వివరాలు సరైన పద్దతిలో తీసుకోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లోనే నగదు జమ చేయాలన్నారు.

ప్రతి కేంద్రం వద్ద కరోనా నిబంధనలు పాటించాలని, రైతులు ఒకే దగ్గర గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.