స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న కొత్తగడి రైల్వే అండర్ బ్రిడ్జి..

స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న కొత్తగడి రైల్వే అండర్ బ్రిడ్జి..

ఆర్.బి.ఎం డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్క వైపు వాగులు చెరువులు పొంగి పొర్లుతుంటే మరో వైపు దిగువనున్న ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్త గడి రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తుంది.
పూర్తిగా బ్రిడ్జి క్రింద నీరు చేరడంతో కొంపల్లి,అత్వేల్లి,మోత్కుపల్లి,మదన్ పల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలై సంవత్సరాలు గడుస్తున్నా అది మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండి పోయింది. బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని విద్యార్థులు, అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.