కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల.. షాక్ లో రేవంత్ రెడ్డ్..!

కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల.. షాక్ లో రేవంత్ రెడ్డ్..!

హైదరాబద్ ఆర్.బి.ఎం డెస్క్: వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి నేటి వరకు తనదైనశైలిలో రాష్ట్ర ప్రభుత్వాని తన ప్రశ్నల వర్షంలో ముంచేతుతోంది. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేసిన వైఎస్ షర్మిల తెలంగాణలో సరికొత్త రాజకియం పరిచయం చేశారు. కాగా వైఎస్ షర్మిల ఇటివల కాలంలో కొంత సైలెంట్ గా ఉంటున్నారు . ఆమె నిశబ్దం వెనుక ఆ పార్టీ కార్యకర్తల్లో అలజడి మొదలైంది. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్లో విలీనం చేబోతున్నారనే వార్తలు వినిపిస్తునాయి. దీనికి కారణం షర్మిల గత రెండు నెలలుగా పార్టీ కి సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా చేయకపోవడమే అని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే షర్మిల బెంగుళూరు వేధికగా పావులు కదుపుతున్నారు. ఇదివరకే డీకే శివ కుమార్ ను వైఎస్ షర్మిల నలుగు, ఐదు కలిశారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదట. కానీ షర్మిల రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ దొరికితే ఢిల్లీ వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపద్యంలోనే షర్మిల పార్టీ పరంగా ఎలాంటి వివాదాలు ఉండకూడదని సైలెంట్ గా ఉన్నారని సమాచారం.

నేహా అందాల రచ్చ చూస్తే..

Leave a Reply

Your email address will not be published.