జగన్ కాలికి గాయం?.. ఢిల్లీ పర్యటన రద్దు

ys jaganmohanreddy apcm

జగన్ కాలికి గాయం?.. ఢిల్లీ పర్యటన రద్దు

ఆర్.బి.ఎం అమరావతి: సీఎం జగన్ పర్యటన రద్దయింది. కేంద్ర హోంమత్రి శాఖ ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి సమావేశం జరుగునుంది. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకావాలని అనుకున్నారు. ఈ సమావేశం కోసం సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ రోజు ఉదయం నడుస్తుండగా సీఎం జగన్ కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం 4 – 5 గంటల మధ్యలో జగన్ నిద్రలేస్తారు. రాత్రి ఎంత ఆలస్యం అయినా కూడా జగన్ డైలీ దినచర్య మాత్రం ఉదయం అదే సమయంలో ప్రారంభమవుతుంది. ఆయన ఉదయం నిద్ర లేచిన వెంటనే వ్యాయామం చేస్తారు. డైలీ దినచర్యలో భాగంగా ఈ రోజు వ్యాయామం చేస్తోంటే కాలు బెణకడంతో ఆయనను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి హోం మంత్రి సుచరితతో పాటు అధికారులు హాజరవుతారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.