దళిత బంధులా.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ బంధు ఇవ్వాలి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

దళిత బంధులా.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ బంధు ఇవ్వాలి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విధంగానే మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకం ప్రవేశపెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్,మైనారిటీ బడ్జెట్ కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సభ ఓట్లు ఆశించేందుకు పెట్టలేదని కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు సరైన న్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. దేశంలో మైనార్టీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీని ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే చివరకు మోసపోయింది మైనార్టీ ప్రజలేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొన్ని చట్టాలను కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అని రేవంత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీకి మోడీతో పోరాడే శక్తి ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.