దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే తెరాస పార్టీకే నష్టం: తెరాస నేత కడియం శ్రీహరి

దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే తెరాస పార్టీకే నష్టం: తెరాస నేత కడియం శ్రీహరి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే తెరాస పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని తెరాస పార్టీ సినీయర్ నాయకుడు కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.దళితుల వ్యతిరేకతను తెరాస పార్టీ కూడగట్టుకోవాల్సి పరిస్థితి వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.రాబోయే ఉప ఎన్నికలో గోరమైన నష్టాన్ని కూడా తెరాస పార్టీ చవిచూడాల్సి వస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.ఒక్కమాటలో చెప్పాలంటే తాము సింహం మీద సవారీ చేస్తున్నామని ఆ సింహం పైన కూర్చునంతా సేపు మాత్రమే దాని మనం నడుపగలం అని దాని మీద నుండి దిగితే అది మానను చంపేసి తింటుందని కడియం శ్రీహరి అన్నారు.ఈ దళిత బంధు పథకాన్ని నీరుగార్చే పని చేసిన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినా తీవ్రంగా నష్టపోయేది మా పార్టీ మా ప్రభుత్వం అని కడియం శ్రీహరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.