తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు వెల్లడించారు . తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతుండటం, విద్యాసంస్థల్లో గత కొద్దిరోజులుగా భారీ సంఖ్యలో విద్యార్థులు, టీచర్లకు కరోనా వ్యాపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు . వైద్య విద్యాసంస్థలు మినహా అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకురాలతో సహా అన్ని హాస్టల్స్‌ను మూసివేస్తున్నం అని ఆమె అన్నారు . ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా జరుగుతాయని కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు . విద్యాసంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు భయానికి గురవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published.