ఏపీ కొత్త ఎస్ఈసీ కోసం సర్కార్ కసరత్తు..

ఏపీ కొత్త ఎస్ఈసీ కోసం సర్కార్ కసరత్తు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం కోసం జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.ఈ క్రమంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ముగ్గురు అధికారుల పేర్లను కొత్త ఎస్ఈసీగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం గవర్నర్ను కోరింది. ఏపీ ఎస్ఈసీ రేసులో ఉన్న తాజా మాజీ సీఎస్‌ నీలం సాహ్నీతో పాటు ప్రస్తుత జగన్‌ సలహాదారుల్లో ఒకరైన శామ్యూల్, అదేవిదంగా మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి ఉన్నారని తెలుస్తోంది .

ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌, నీలం సాహ్నీ ఈ రేసులో ఉంటారని తెలుస్తోంది . ఈ ముగ్గురి అధికారుల్లో ఒకరిని గవర్నర్‌ తదుపరి ఎస్ఈసీగా నియమించే అవకాశాలు ఉన్నాయి .మరో వారం రోజుల్లో నిమ్మగడ్డ పదవీ కలం ముగుస్తున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో ఆ అధికారుల నివేదికలు తెప్పించుకుని గవర్నర్ చివరి నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published.