వైఎస్ఆర్ నమ్మిన బంటు సూరీడుపై హత్యాయత్నం..

వైఎస్ఆర్ నమ్మిన బంటు సూరీడుపై హత్యాయత్నం..

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నీడ లాగా పనిచేసిన సూరీడిపై హత్యాయత్నం జరిగిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సూరీడిపై తన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్ బాట్ తో హత్య చేసేందుకు యత్నించిన తన అల్లుడు డా. సురేంద్రనాథ్ రెడ్డి. సూరీడు కూతురిని తరుచు వేధింపులకు గురిచేస్తుండటంతో గతంలోనే డా. సురేంద్రనాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదు చేయించిన సూరీడు. తన పై పెట్టిన కేసులను వెన్నకి తీసుకోవాలని గతంలో కూడా ఒక్కసారి హత్యాయాత్నం కు యత్నించిన డా. సురేంద్రనాథ్ రెడ్డి. సూరీడు కుమార్తె గంగా భవాని తన భర్త సురేంద్రనాథ్ రెడ్డి తో తమకు ప్రాణ హాని ఉందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈమేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published.