రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప సభాపతి పద్మారావు గౌడ్. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించి శుభాలు, విజయాలను అందించే వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో కరోనా నిబంధనలను పాటించి జరుపు కోవాలని అయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని , ఈ ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందాలని పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. ఆ విఘ్నాధిపతి ఆశీస్సులతో ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలుతో జీవించాలని, కరోనాపై విజయం సాధించాలని పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. రసాయనాలతో తాయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం చేకూరుతుందని అందువల్లే మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పద్మారావు గౌడ్ కోరారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆ విఘ్నాధిపతి క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్దించాలని సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు.