కరోనా కట్టడికి ఎర్ర చీమల చట్నీ.. సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు..

supremcourt errachimala chatini

కరోనా కట్టడికి ఎర్ర చీమల చట్నీ.. సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు..

ఆర్.బి.ఎం డెస్క్: ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎర్ర చీమల చట్నీ ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలి అంటూ సుప్రీం కోర్ట్ లో దాఖలైన పిటిషన్ పై కోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సాంప్రదాయ ఇంటి చిట్కాలను ఉపయోగించాలని ఆదేశించలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టి వేసింది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ఎర్ర చీమలను ఆహార పదార్థాల్లో వాడుతారు. పలు రాష్ట్రాల్లో ఎర్ర చీమలతో చట్నీ,సూప్ కూడా తాయారు చేసుకుంటారు.

గిరిజనులు ఈ సాంప్రదాయ ఇంటి చిట్కాలను ఎక్కువగా నమ్ముతారు. ఈ ఎర్ర చీమలతో చేసిన చట్నీ వాడడం వల్ల ఫ్లూ లక్షణాలున్న వ్యాధులన్నీ తగ్గిపోతాయని వారి నమ్మకం.ఈ చట్నీని ఎర్ర చీమలలో పచ్చి మిర్చి కల్పి తాయారు చేస్తారు. ఎర్ర చీమల చట్నీతో తో ఫ్లూ సంబంధిత వ్యాద్యులు తగ్గుతాయని ఈ క్రమంలోనే ఈ చట్నీని కరోనా మందుగా వాడుకోవచ్చనే ప్రచారం తాజాగా జరిగింది. ఇంజనీర్ పరిశోధకుడు నయాథార్ పథియల్ ఓడిశాలోని బరిపడ ప్రాంతానికి చెందిన వ్యక్తి గతేడాది జూన్ లోనే ఎర్ర చీమల చట్నీతో కరోనా తగ్గిపోతుందని ప్రకటించాడు.

సర్వోన్నత న్యాయస్థానం గిరిజన తెగకు చెదిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సాంప్రదాయ ఇంటి చిట్కాలను ఉపయోగించాలని ఆదేశించలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టి వేసింది. ప్రతి ఇంట్లో కావల్సినంత సాంప్రదాయ విజ్ఞానం ఉందని ఆ చిట్కాలు మనం సొంతగా వాడుకోవొచ్చని,ఆ చిట్కాలను మీరు ఉపయోగించాలనుకుంటే అది మీ ఇష్టం కాకపోతే రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానంగా ఆ ఇంటి చిట్కాలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఆచరించాలని ఆదేశించలేమని జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ డీవై చంద్రచూడ్ జస్టిస్ విక్రమ్ నాథ్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.