విఘ్నాలు తొలగాలి.. శుభాలు కలగాలి: బి.జనార్దన్ రెడ్డి బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి
ఆర్.బి.ఎం డెస్క్: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి. జనార్దన్ రెడ్డి . విఘ్నాలు తొలగించి శుభాలు, విజయాలను అందించే వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో కరోనా నిబంధనలను పాటించి జరుపు కోవాలని బి.జనార్దన్ రెడ్డి కోరారు. వినాయకుని ఆశీస్సులతో కరోనా వైరస్ త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలుతో జీవించాలని, కరోనాపై విజయం సాధించాలని జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలునే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జనార్దన్ రెడ్డి కోరారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలుతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలుకు జనార్దన్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.