సికింద్రాబాద్లో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్: ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్..

సికింద్రాబాద్లో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్: ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: సికింద్రాబాద్ లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. బుధవారం అయన సితఫలమండీ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాల కలగా నిలిచిన తుకారంగేటు RUB ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మా హయంలోనే చేపట్టి విజయవంతంగా పూర్తీ చేశామన్నారు. రూ. 72 కోట్ల భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తీ చేశాం అని వెల్లడించారు.

సితాఫలమండీ నుంచి ఉస్మానియా క్యాంపస్, మానికేశ్వరి నగర్ వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు రైల్వే ట్రాక్ అడ్డుగోడగా నిలుస్తుండడంతో రైల్వే ట్రాక్ కింది నుంచి ఓ RUB నిర్మించాలని మేము ప్రాతిపాదించాము. రూ. 20 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తేలిందని అన్నారు.

మెట్టుగూడ వైపు నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకలగూడ వైపు ప్రధాన మార్గంలో చిలకలగూడ వద్ద రైల్వే(RUB) విస్తరణకు తాము చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రూ. 30 కోట్ల నిధులను మంజురుచేసింది. పెరిగిన ట్రాఫిక్ రాకపోకలకు అనుగుణంగా కొత్త RUB ఉపయోగపడుతుంది.
సితాఫలమండీ కుట్టి వేల్లోడి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని 35 పడకల నుంచి పూర్తీ స్థాయిలో 70 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కొత్త భవన్ సముదాయాలను రూ.9.30 కోట్లతో నిర్మిచానున్నాము. ఈ ఆసుపత్రి (G+3) భవన సముదాయాల నిర్మాణానికి తాజాగా నిధులను మంజూరు చేయించాము అని ఆయన అన్నారు.

సికింద్రాబాద్ పరిధిలో ప్రభుత్వ పరంగా ఒక్క జూనియర్ కాలేజీ/డిగ్రీ కాలేజి కూడా లేని లోటును తీర్చాము. విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల కోసం కొత్త భవన సముదాయ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేయించాము. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్ కు సంబంధించి నిరుద్యోగులకు ఈ ఉద్యోగావకాశాలను పొందేందుకు మంచి కోచింగ్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించాలని నిర్ణయించాము. త్వరలో స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేస్తాము. సికింద్రాబాద్ కు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published.