డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ అని ఉప సభాపతి పద్మారావు గౌడ్ కొనియాడారు. దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ ఆదర్శనీయమే అని గుర్తు చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్‌ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి డా. బాబు జగ్జీవన్ రామ్ తిరిగారని పద్మారావు గౌడ్ చెప్పుకొచ్చారు. యుద్ధం పాక్‌ భూభాగంలో మాత్రమే జరగాలనీ, భారత్‌ భూభాగంలో కాదనీ ఉద్భోధించి, భారత సైన్యాన్ని ఉత్సాహ పరుస్తూ సైనికుల్లో సైనికుడిలా మెలిగిన రక్షణ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు అని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెరాస కార్పొరేటర్లు కుమారి సామల హేమ, మరియు రాసురి సునీత తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.