లాక్ డౌన్ పొడగింపా?సడలింపా?

లాక్ డౌన్ పొడగింపా?సడలింపా?

ఆర్.బి.ఏం డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు లాక్ డౌన్ నేపధ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కెబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడగించాలా లేదా సడలింపులు చేయాలా అనే అంశాల పై కెబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్లో ఈ రోజు మధ్యాహ్నం కెసిఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.

ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుండు పది గంటల వరకు సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మరో రెండు గంటలు అంటే ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఉన్న సడలింపులు 12 గంటల వరకు పొడగిస్తారని సమాచారం.

లాక్ డౌన్ పొడగించాలా వద్ద అనే అంశాలు పోలీసు అధికారులు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించారు. లాక్ డౌన్ సమయంలో సడలింపులు పొడిగిస్తే జనాలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులో సడలింపులు పొడగించక పోవడం శ్రేయస్కరం అని వారు సూచించారు.

లాక్ డౌన్ విధించడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పుడు రోజుకు పది వేల కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంబై వేల కరోనా టెస్టులు చేస్తే అందులో కేవలం మూడు వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ పొడగింపు ఉంటె మంచిదే అని అధికారులు వెల్లడించారు.

ఈ రోజు కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగే సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేచి చుస్తునారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం సర్వత్రా నెలకొంది.

కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగబోయే సమావేశంలో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ఇన్ని రోజుల నుండి పడిన శ్రమా అంత వృధా అయ్యే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు . గతంలో విధించినట్టు రాత్రి karfew విధిస్తే మళ్ళి పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడగింపు ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేలే అని తెలుస్తోంది.

మొత్తానికి ఈ రోజు జరగబోయే సమావేశం ఉత్కంతంగా మారబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కెసిఆర్ ఎం ప్రకటిస్తారో అని టీవీ లకు అత్తుకుపోయారు. కెసిఆర్ అధ్యక్షతన జగబోయే ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నే కాకుండా ఇతర అంశంపై కూడా మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయం పై కూడా కెసిఆర్ ద్రుష్టి సారించనున్నారు.

నగరంలో కరోనా విజృంభణ కాస్త ఊరటనిస్తోంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా వ్యాప్తి రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కారొనపై అవగాహనా లేకపోవడం వల్లే గ్రామాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతూ వస్తోంది అని తెలుస్తోంది. గ్రామంలో నివసించే ప్రజలు కారొనపై పూర్తి అవగాహనా కల్పించాలి ఆలా చేస్తే గ్రామంలో కూడా కరోనా వ్యాప్తి తగ్గి పోయే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.