తెలంగాణాలో లాక్ డౌన్ పొడగింపు వద్దు: ఎంపీ అసదుద్దీన్‌

తెలంగాణాలో లాక్ డౌన్ పొడగింపు వద్దు: ఎంపీ అసదుద్దీన్‌

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ట్విట్టర్ వేదికగా ప్రజలను ఉద్దేశించి అయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అయన వ్యాఖ్యానించారు. పేద ప్రజలు కేవలం నాలుగు గంటల సమయంలో ఎలా వారి జీవనోపాధితో బ్రతుకుతారని అయన అన్నారు. పేద ప్రజలు రోజు మొత్తం పని చేస్తే తప్ప వారికీ జీవనం సాగదని అయన అన్నారు.

లాక్ డౌన్ తో పేద ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారని అయన తెలిపారు. ఈ రోజు కెసిఆర్ అధ్యక్షతన జరగబోయే కెబినెట్ సమావేశం నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్‌ తెలంగాణ సీఎంఓ కు ట్విట్ చేశారు. కరోనా ను నియంత్రించాలంటే దానికి లాక్ డౌన్ మాత్రమే ఆయుధం కాదని అయన అన్నారు. ఈ లాక్ డౌన్ లో కఠినమైన నిర్ణయాలు రాష్ట్రా ప్రభుత్వం తీసుకోవడం వల్ల సామాన్య పేద ప్రజల జీవితాలు నాశం అవుతున్నాయని ఎంపీ అసదుద్దీన్‌ ట్విట్టర్ లో తెలిపారు.

కేవలం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో కరోనా విజృంభణ తగ్గదని కరోనా ను నియంత్రించడానికి వేరే మార్గాలు అలోచించి పేద ప్రజలను ఆదుకోవాలని ఎంపీ అసదుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సామాన్య పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మినీ లాక్ డౌన్ విధిస్తే వారికీ కొంత ఊరట కలుగుతుందని అయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నాలుగు గంటల సమయంలో పేద ప్రజలకు ఏ విధంగా వారి జీవనోపాధికి తోడ్పడుతోందని ఎంపీ అసదుద్దీన్‌ ప్రభుత్వాని ప్రశ్నలతో ముంచెత్తారు. కరోనా ను నివారించాలంటే ప్రతి ఒక్కరు సామజిక దూరం పాటిస్తూ మాస్క్లు ధరించి ఆ వ్యాధి పట్ల అవగాహనా ఏర్పర్చుకుంటే దాని నివారించే అవకాశం ఉందని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ ను ఎంత పొడగించిన పెద్దగా ఉపయోగం ఉండకపోవొచ్చని కరోనా ను నియంత్రించడం కేవలం వాక్సిన్ తోనే సాధ్యమని ఎంపీ అసదుద్దీన్‌ ట్విట్టర్ వేదికగా సీఎంఓకు పంపిన ట్విట్ లో పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published.