కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారు.. ఆలోచిస్తామని చెప్పి 8 నెలలైంది: వైయస్ షర్మిల
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా చికిత్సను పేద ప్రజలు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ఇంకెప్పుడు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తారంటూ వైఎస్ షర్మిల ప్రభుత్వాని నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఆలోచనలో ఉన్నామని గత ఎనిమిది నెలల క్రితం చెప్పారు. మీరు ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తూ ఉంటారు అని ఆమె అన్నారు. ఎనిమిది నెలలు గడిచిన కూడా అది నెరవేరలేదు అని ప్రభుత్వంపై షర్మిల తన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి చనిపోయేది పేదలే కదా? అడిగేవారు ఎవరు లేరనే ధైర్యమా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై తిరగబడక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని ఆమె అన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చని పక్షంలో ప్రజల ఉసురుతో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం అని వైఎస్ షర్మిల తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.