సాయి పల్లవి భారీ మొత్తాన్ని తిరస్కరించారు

సాయి పల్లవి భారీ మొత్తాన్ని తిరస్కరించారు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: చాలామంది హీరో హీరోయిన్లు కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తారు, వాళ్లలో సాయిపల్లవి ఒకరు. సాయి పల్లవి చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటారు, సినిమా పెద్దదా చిన్నదా, అందులో టాప్ హీరో నా కాదా అనేది ఆలోచించకుండా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే అంగీకరిస్తారు.

సాయి పల్లవి ప్రతి సినిమాకు 80 లక్షల నుండి 1 కోట్ల వరకు వేతనం తీసుకుంటారు. ఫిడా చిత్రం తరువాత సాయి పల్లవికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె ప్రతి సినిమాను అంగీకరించలేదు, కథ మరియు పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈ విధంగా సాయి పల్లవి గత మూడేళ్లలో 4 పెద్ద చిత్రాలను తిరస్కరించారు మరియు మూడేళ్ళలో 5 కోట్ల రూపాయలను కోల్పోయారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “డియర్ కామ్రేడ్” సినిమా లో, మొదట సాయి పల్లవినీ హీరోయిన్ గా అనుకున్నారూ, కానీ ఆమెకు ఆ పాత్ర నచ్చలేదు అయితే ఈ ఆఫర్ ను తిరస్కరించింది. “సరిలేరు నికేవ్వారు” లో కూడా సాయి పల్లవినీ హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ అందులో ఆమె పాత్ర నచ్చకపోవడంతో ఆమె సినిమాను తిరస్కరించింది.

Leave a Reply

Your email address will not be published.