హాస్యనటుడు గౌతమ్ రాజు ఇంట్లో విషాదం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలుగు సినీ హాస్యనటుడు గౌతమ్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గౌతమ్ రాజు సోదరుడు సిద్దార్థ్ కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. సిద్దార్థ్ కు కరోనా పాజిటివ్ కావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకకపోవడం వల్ల కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి పై నమ్మకంతో అయన ఆస్ప్రత్రిలో చేరారని గౌతమ్ రాజ్ తెలిపారు. సిద్దార్థ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
గౌతమ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ సేవలను అందించేటప్పుడు వైద్యలు రోగులను మానవీయ దృక్పథంతో చికిత్స చేయడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కరోనా తో బాదపడుతున్న రోగులను మీ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందంటూ మీరు చనిపోతారు అంటూ వైద్యలు రోగులను భయాందోళనకు గురిచేస్తున్నారు అని అయన అన్నారు. తన సోదరుడి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని గత మూడు రోజుల నుండి అతనికి ఎలాంటి చికిత్స చేయకుండా అతనికి ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా తగ్గాయని వైద్యులు అన్నారని అయన అన్నారు.
కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్న కాకినాడ ఆస్పత్రికి కొంత మంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల చెడ్డ పేరు వస్తుందని అయన అన్నారు. ఆస్పత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ముందుగా వచ్చిన కరోనా రోగులను చంపేస్తూ కొత్తగా వస్తున్న కరోనా రోగులకు పడకలు ఇస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకినా వ్యక్తికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని ఆలా సిద్దార్థ్ కు ఆక్సిజన్ అందించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని అయన విచారం వ్యక్తం చేశారు.
నేను నా సోదరుడిని వైద్యుల నిర్లక్ష్యం వల్ల కోల్పోవడం వల్ల మనోవేదనకు గురై ఇలా మాట్లాడుతున్న నేను ఎలాంటి రాజకీయ లబ్ది కోసం మాట్లాడడం లేదని అయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా సోకి ఆస్పత్రిలోకి ప్రవేశించిన రోగులు బతికి ఉంటారా లేదా అనే దానిపై ఎటువంటి హామీ లేకుండాపోయిందని అయన అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక జంట ఆస్పత్రిలో చేరితే తిరిగి ఇంటికి ఎవరు వెళ్తారో తెలియని పరిస్థితి అని అయన అన్నారు. కరోనా అతి వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అయన కోరారు.