కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు రహస్యం ఇదేనా?

kcr modi

కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు రహస్యం ఇదేనా?

ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అత్యంత రహస్యంగా జరుగుతోంది. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 3న ప్రధాని నరేంద్రమోదీని, 4న హోంమంత్రి అమిత్‌ షాను కలుసుకున్నారు. 5న మాత్రం ఎవరినీ కలుసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కూడా కలుసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆయనఅపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఇక ఈ నెల 6న కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిని, జలశక్తి మంత్రిని కలుసుకున్నారు. 7న తెలంగాణ లోవరదల పరిస్థితి గురించి అధికారులతో ఫోన్‌ ద్వారా సమీక్షించారు. కేసీఆర్ ఎనిమిది రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. ఆయన తిరిగి ఎప్పుడు రాష్ట్రానికి వస్తారా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. అంత గోప్యంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతలు నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. అడిగిన వెంటనే కేసీఆర్‌కు ప్రధాని,హోంమంత్రి అపాయిట్‌మెంట్లు ఇవ్వడాన్ని తెలంగాణ కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్‌ అడిగిన వెంటనే ఢిల్లీ పెద్దలు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ భేటీల వెనుక మోదీ, కేసీఆర్ ప్రయోజనాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగంటే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యర్థి అయ్యేందుకు ప్రయత్నిస్తూన్నా.. తాను మాత్రం కేంద్రానికి రాజకీయ ప్రత్యర్థి కాదని చెప్పడ్డానికే కేసీఆర్ సంకేతాలిస్తున్నారనే జరుగుతోంది. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. అయితే కేసీఆర్ తటస్థంగా ఉంటారు. అందువల్ల ఇలాంటి నేతలను మోదీ వదులుకోరని, స్నేహహస్తమే అందిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.