కౌశిక్‌రెడ్డిని గవర్నర్ ఎందుకు తప్పబడుతున్నారు.. వెనుక బీజేపీ నేతల మంత్రాంగం ఉందా?

కౌశిక్‌రెడ్డిని గవర్నర్ ఎందుకు తప్పబడుతున్నారు.. వెనుక బీజేపీ నేతల మంత్రాంగం ఉందా?

ఆర్.బి.ఎం హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేత కౌశిక్‌రెడ్డికి ఊహించిన షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు గవర్నర్ తమిళ సై బ్రేక్ వేసింది. గతంలో ఎమ్మెల్సీ పదవి నామినేటెడ్ విషయంలో ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళ సై కౌశిక్ రెడ్డి విషయంలో ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు. ఒక వైపు ఢిల్లీ పెద్దలతో సీఎం దోస్తీ కడుతుంటే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఎందుకంత ఉత్కంఠ నెలకొంది.

ఆగస్టు 1 ఒకటవ తేదీన కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం పొంది దాదాపు నెలన్నర కావస్తున్నా గవర్నర్ ఇప్పటివరకు ఆ ఫైల్‌పై సంతకం పెట్టకపోవడాని కారణం ఎంటన్నది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ప్రతిపాదనను పంపగానే ఆ మరుసటిరోజే ఆమోద ముద్ర వేశారు. మరి కౌశిక్ రెడ్డి విషయంలో ఆలస్యం ఎందుకన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కౌశిక్‌రెడ్డి ఫైల్ ఆలస్యానికి గవర్నర్ తమిళ సై కారణం చెప్పిన ఆసలు మతలబు వేరే ఉన్నదనే ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ గెలుపే లక్ష్యంగా కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కౌశిక్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన కూడా టికెట్ ఆశించే టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజురాబాద్‌లో అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నారు. అందులోభాగంగా బీసీ ఓట్లకు గాలం వేసేందుకు గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలబెట్టారు. రెడ్లను కూడా సంతృప్తి పర్చడానికి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఆయన పేరును కేబినెట్‌ సిఫారసు చేసింది. వాస్తవానికి రాష్ట్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసి.. పంపిన ఫైల్‌ను గవర్నర్‌ తిప్పి పంపకూడదు. కానీ ఎన్ని రోజులైనా హోల్డ్‌లో పెట్టవచ్చు. ఐతే కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయని అలాంటి వ్యక్తిని గవర్నర్ కోటాలో పెద్దల సభకు ఎలా పంపిస్తారని గతంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై గతంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారు. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.